Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఒడిస్సా తరహా ఘటన.. తోపుడు బండిలో భార్య మృతదేహం.. 60 కిలోమీటర్లు?

ఒడిస్సా ఘటన తెలంగాణలో పునరావృతమైంది. ఆంబులెన్స్‌లో భార్య శవాన్ని తీసుకెళ్లలేని ఓ వ్యక్తి యూపీలో తన భుజంపై శవాన్ని వేసుకుని కిలోమీటర్ల మేర నడిచిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (13:39 IST)
ఒడిస్సా ఘటన తెలంగాణలో పునరావృతమైంది. ఆంబులెన్స్‌లో భార్య శవాన్ని తీసుకెళ్లలేని ఓ వ్యక్తి యూపీలో తన భుజంపై శవాన్ని వేసుకుని కిలోమీటర్ల మేర నడిచిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా భార్య గుండెపోటుతో మరణించడంతో ఆమె భౌతిక కాయాన్ని ఆ వృద్ధ భర్త తోపుడు బండిలో ఉంచి 60కిలోమీటర్ల మేర తోసుకొచ్చిన ఘటన తెలంగాణ, మాయ్‌గోడ్ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ, మాయ్‌గోడ్ గ్రామానికి చెందిన దంపతులు రాములు-కవిత పెద్దరోగంతో బాధపడేవారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో శుక్రవారం లింగాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భిక్షమెత్తుతుండగా.. కవిత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తన భార్య మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరపాలని రాములు నిర్ణయించుకున్నాడు. 
 
అంతే భార్య మృతేదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక.. తోపుడు బండిలో భార్య మృతదేహాన్ని వుంచి తోసుకెళ్లాడు. 60 కిలోమీటర్ల భార్య మృతదేహాన్ని ఆ వృద్ధ రాములు తోసుకొచ్చాడు. ఈ క్రమంలో దారికూడా తప్పాడు. ఆపై కవిత మృతదేహాన్ని తోసుకెళ్లేందుకు రాములు ఒంటిలో శక్తి లేకపోవడంతో నడిరోడ్డుపై కూర్చుని.. ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాములకు ఆర్థిక సాయం చేసి సొంతూరికి పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments