Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో టీడీపీకి షాక్ : సీఎం కేసీఆర్ చెంతకు రావుల చంద్రశేఖర్ రెడ్డి?

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ విప్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆయన బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. దీంతో ఈ నెల 15వ తేదీ లోపు ఆయన సీఎం కేసీఆర్ చెంతకు చేరవచ్చని ఊహాగానాలు వినొస్తున్నాయి. 
 
మరోవైపు, వనపర్తి నుంచి 1994, 2009లో ఆయన తెదేపా తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి టీడీపీ ముఖ్య నేతలు వివిధ పార్టీల్లో చేరారు. 
 
రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన్ని పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికీ రావులకు వ్యక్తిగతంగా మంచిపట్టు ఉంది. బీఆర్ఎస్‌లో చేరికపై జోరుగా జరుగుతున్న ప్రచారంపై రావుల అభిప్రాయం కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments