Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో భారీ వర్షాలు.. వాయిదా పడిన పరీక్షలు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:38 IST)
హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలు ఈ నెల 19 నుంచి 20 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసుకున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల కారణంగా అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే చాలామంది విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. 
 
మరోవైపు వాతావరణ శాఖ సైతం మరికొన్ని రోజులు భారీగా వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ పలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరగనున్న యూజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments