Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీల దుర్మరణం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (13:42 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చండ్రుగొండు మండలంలోని సుజాత నగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డి పల్లి మండలానికి వరినారు తీసేందుకు ఒక బొలెరో వాహనంలో బయలుదేరారు. 
 
ఆ సమయంలో తిప్పనపల్లి వద్ద ఈ వాహనం వెళుతుండగా ఎదురుగా బొగ్గు లోడుతో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందుభాగం బాగాదెబ్బతిన్నది. దీంతో ముందు భాగంలో కూర్చొన్న కూలీల్లో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మరో ఇద్దరు మార్గమద్యంలో చనిపోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments