ఆక‌లితో అల‌మ‌టించొద్దు... సీఎం కేసీయార్ లక్ష్య‌మిది!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

సోమవారం బేగంపేట లోని జురాస్టియాన్ క్లబ్ లో కొత్త తెల్లరేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదప్రజలకు నిత్యావసర సరుకులను సబ్సిడీ పై అందించే తెల్లరేషన్ కార్డుల పంపిణీ ని రాష్ట్రవ్యాప్తంగా నేటినుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85, 756 తెల్లరేషన్ కార్డ్ లు ఉన్నాయని, వీటి ద్వారా 21,90,034 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. నూతనంగాఅర్హత పొందిన 56, 064 తెల్లరేషన్ కార్డ్ లను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారా 2.25 లక్షల మందికి లబ్దిచేకూరుతుందని  మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

కొత్తగా కార్డులు పంపిణీ చేసిన వారికి ఆగస్టు నెల నుండే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కాలేరు వెంకటేష్, ఆర్డీవో వసంత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments