Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మాటకొస్తే కేసీఆరే స్థానికత నిరూపించుకోవాలి : టీ కాంగ్రెస్

Webdunia
శనివారం, 2 ఆగస్టు 2014 (09:48 IST)
స్థానికత అంశంపై తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 1956 స్థానికత అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి చెప్పారు. విదేశాల్లో పదేళ్లు ఉంటే అక్కడి పౌరసత్వాన్ని ఇస్తారని తెలంగాణలో స్థానికతకు 60 యేళ్లు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి విద్యార్థికి ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ సందర్భంగా శుక్రవారం సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పుట్టినవారి, సెటిలర్ల పిల్లలకు ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి విషయానికి స్థానికతనో, తెలంగాణ అనో సెంటిమెంట్‌తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఆ మాటకొస్తే కేసీఆర్ కూడా స్థానికత నిరూపించుకోవాల్సి వస్తుందున్నారు. 
 
ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... స్థానికత గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. అసలు కేసీఆర్ స్థానికత ఏంటని ఆయన ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలతో విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కోరారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments