Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: చంద్రబాబు పేరును చేర్చాలన్న కేసు వచ్చే యేడాదికి వాయిదా!

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (10:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరును కూడా చేర్చాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాది జులై 17కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 
 
2017లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ దాఖలు చేసిన ఎర్లీ హియరింగ్ అప్లికేషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రహ్మణ్యంలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపించారు.
 
రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పిటిషనర్ తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నప్పటికీ తెలంగాణ ఏసీబీ కూడా ఆయన పేరును చేర్చలేదని కోర్టుకు తెలిపారు. స్పందించిన న్యాయస్థానం కేసును జులైలో విచారిస్తామని చెబుతూ ‘ఎర్లీ హియరింగ్ అప్లికేషన్’పై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments