Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామూహిక వేదనను తలపించిన శ్రీనివాస్ అంతిమయాత్ర

కుటుంబం కాదు.. ఒక జాతి సామూహిక వేదన ఎలా ఉంటుందో శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు ప్రపంచానికి చూపించాయి. మెరుగైన జీవితం కోసం కొండంత ఆశలను వెంటబెట్టుకుని జీవన సహచరి సునయనతో అమెరికా వెళ్లిన శ్రీనివాస్ అమెరికన్ ఉన్మాదపు చీకటి కోణానికి బలై భార్య తోడుగానే

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (04:54 IST)
కుటుంబం కాదు.. ఒక జాతి సామూహిక వేదన ఎలా ఉంటుందో శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు ప్రపంచానికి చూపించాయి. మెరుగైన జీవితం కోసం కొండంత ఆశలను వెంటబెట్టుకుని జీవన సహచరి సునయనతో అమెరికా వెళ్లిన శ్రీనివాస్ అమెరికన్ ఉన్మాదపు చీకటి కోణానికి బలై భార్య తోడుగానే పార్థివ దేహమై స్వదేశానికి తిరిగొచ్చాడు. అయిదు రోజులుగా ఆ జీవన సహచరి దుఃఖాన్ని ఎలా అణుచుకుందో ఊహకైనా సాధ్యం కాదు కానీ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి భర్త శవంతో ఇంటికి రాగానే అత్తమామలను, బంధువులను చూస్తూ రోదన మొదలెట్టింది. దేవుడా ఎందుకిలా చేశావు.. 32 ఏళ్లకే ఒక నిండు ప్రాణాన్ని ఇంత నిర్దయగా ఎలా తీసుకెళ్లిపోయావు. పాతికేళ్ల వయస్సులోనే ఆశలన్నీ చిదిమివేసి నా సహప్రాణాన్ని బలవంతంగా నానుంచి దూరం చేశావు.. మా కుటుంబం ఏ అన్యాయం చేసింది.. అంటూ సునయన విలపిస్తుంటే  కసాయి గుండెలు భళ్లుమన్నాయి. 
 
మా ప్రారబ్ధం.. విలపించిన శ్రీనివాస్ తల్లిదండ్రులు
సోమవారం రాత్రి 1130 గంటల సమయంలో శ్రీనివాస్‌ భౌతికకాయం ఆయన స్వగృహానికి చేరుకోగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బోరున విలపిస్తున్న శ్రీనివాస్‌ తల్లి వర్ధిని, భార్య సునయనలను ఆపడం ఎవరితరం కాలేదు. ‘పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారని ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే తిరిగి వచ్చేయాలని శ్రీనివాస్‌కి చెప్పేదానిని. అలాంటివేమీ లేవని శ్రీనివాస్‌ చెప్తూ ఉండేవాడు. ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని కోరుతున్నా’ అంటూ వర్ధిని బోరుమన్నారు. మంగళ వారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30 వరకు శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శ నార్థం ఉంచారు. అనంతరం శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస్‌ పార్థివదేహాన్ని అంతిమయాత్ర రథంలో మహాప్రస్థానానికి తరలించారు.
 
అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్‌ కూచిభొట్ల అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటిక లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మల్లం పేట గ్రామ పరిధిలోని ప్రణీత్‌ నేచర్స్‌ బౌంటీ లోని నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీని వాస్‌ భౌతికకాయాన్ని ఊరేగింపుగా శ్మశానవాటి కకు తీసుకొచ్చారు. శ్రీనివాస్‌ తండ్రి మధు సూదన్‌రావు శాస్త్రోక్తంగా కర్మకాండలను నిర్వ హించారు. శ్రీనివాస్‌ చితికి నిప్పంటిస్తూ.. ఆయన కన్నీటిపర్యంతమైన తీరు అందరినీ కల చివేసింది. శ్రీనివాస్‌ అంత్యక్రియల్లో బంధువు లు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు శ్మశాన వాటికకు చేరుకున్న శ్రీనివాస్‌ భార్య సునయన, తల్లి వర్ధినిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, విద్యా వేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు ఓదార్చారు. ఈ క్రమంలో తమ కుమారుడిని అన్యా యంగా చంపేశారని తల్లి రోదించడం అందరినీ కంట తడిపెట్టించింది.
 
 
శ్రీనివాస్ తల్లి రోదనను, తండ్రి వేదనను తీర్చేదెవరు
అమెరికా బలితీసుకోగా కట్టెదుటికి శవమై వచ్చిన పెద్ద కొడుకు పార్థివ కాయాన్ని చూసి ఆ కన్న తల్లిదండ్రులు నిలువునా కూలిపోయారు. ఎన్నోసార్లు తన కొడుకును భారత్‌కు తిరిగి వచ్యేయవలసిందిగా కోరారని, కానీ తనకు ప్రమాదం లేదు అంటూ భరోసా ఇచ్చిన వాడు ఇప్పుడు ఏ భరోసా మాకు లేకుండా వదిలి వెళ్లిపోయాడంటూ కన్న తల్లి  పర్వత వర్థిని భోరున విలపించింది. అమెరికాలోనే చదువుతున్న చిన్న కొడుకు సాయికిరణ్‌‌ని ఇక అమెరికాకు వెళ్లనివ్వమని తల్లి శపథం చేసింది.మంచి భవిష్యత్తుకోసం వెళ్లిన కుమారుడు ఏం నేరం చేశారని పొట్టన పెట్టుకున్నారు అంటూ రోదిస్తుంటే ఆమెను ఆపడం సాధ్యం కాలేదు.
 
ఇక కన్నతండ్రి. మధుసూదన రావు ఇది విధి. మాకు అలా రాసి ఉంది. పోయాడు అంటూ కన్నీరు కార్చారు. మావాడు దూరమైపోయాడు. కనీసం ఇకనైనా అమెరికాలో ఉంటున్న భారతీయుల రక్షణకు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. 
 
శ్రీనివాస్‌ను కడసారి దర్శించుకోవడానికి వచ్చిన వందలాది బంధువులు, స్నేహితులు, ప్రజలు మౌనంగానే కన్నీళ్లు కార్చారు.  
 
ట్రంప్‌ డౌన్‌డౌన్‌ నినాదాలు
శ్రీనివాస్‌ అంత్యక్రియల్లో పాల్గొనేం దుకు వచ్చిన బంధువులు, స్నేహితులు, వివిధ పార్టీలకు చెంది న వారంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేయడంతో మహాప్రస్థానం శ్మశానవాటిక మారుమోగింది. ‘ట్రంప్‌.. డౌన్‌ డౌన్‌’.. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు ట్రంప్‌కు వ్యతిరేకంగా, హత్యను ఖండిస్తూ ప్లకార్డులను పట్టుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు.
 
నచ్చిన సూట్‌లోనే..
శ్రీనివాస్‌కు ఓ సూట్‌ అంటే చాలా ఇష్టం. శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు అమెరికా నుంచి అతనికి అత్యంత ఇష్టమైన సూట్‌లోనే తీసుకుచ్చారు. శ్రీనివాస్‌ సాయిబాబా భక్తుడు కావడంతో బాబా కండువాను పార్థివదేహంపై కప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments