Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాశ్వతనిద్రలోకి జారుకున్న పౌర హక్కుల నేత ఎంటీ ఖాన్!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (09:47 IST)
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్‌గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. 
 
స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ఎంటి ఖాన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఖాన్ యువకుడిగా ఉన్నప్పుడు రాజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కొంతకాలం కోట్ల అలిజా ధర్మవంత్ విద్యా సంస్థలో పాఠాలు కూడా బోధించారు. ఆ తర్వాత సియాసత్, ఈనాడు గ్రూప్‌నకు చెందిన న్యూస్ టైమ్ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఎంటీ ఖాన్ మృతిపట్ల పౌర హక్కుల నేతలు, గద్దర్, కోదండరాం వంటి నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments