Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ... 19 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (22:04 IST)
ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇదే అతిపెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన మార్గంలో దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించి, ఆదివారం రాత్రి నుంచి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం పరిమితంగా రైళ్లను నడుపుతున్నారు. 
 
ఈ  నేపథ్యంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. షాలిమార్‌ నుంచి ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు వెళ్లాల్సిన (12841) రైలును సోమ, మంగళవారాల్లో రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5న సంత్రగచ్చి-తాంబరం రైలు(22841)తో పాటు హౌరా - చెన్నై (12839), ఎర్నాకుళం - హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. 
 
అదేవిధంగా, ఈ నెల 6న హౌరా - సికింద్రాబాద్‌ (12703), షాలిమార్‌ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (18045), హౌరా - ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22887), సంత్రగచ్చి - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (22807), ఎంజీఆర్‌ సెంట్రల్‌ చెన్నై - హౌరా (12840), విల్లుపురం - ఖరగ్‌పూర్‌(2204), హైదరాబాద్‌ దక్కన్‌- షాలిమార్‌ (18046), షాలిమార్‌ - తిరువనంతపురం (22642), గౌహతి - ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12510), అగర్తలా - ఎస్‌ఎంవీఈ బెంగళూరు (12504), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (12774), సికింద్రాబాద్‌ - హౌరా (12704) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేఅధికారులు తెలిపారు. ఈ నెల 7 తేదీన  షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849) రైలు, 9న సికింద్రాబాద్‌ - షాలిమార్‌(22850) రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments