Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేశారా?

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (18:03 IST)
హైదరాబాద్‌కి చెందిన భవ్యశ్రీ చరిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గత కొద్ది రోజుల క్రితం అదృశ్యం కాగా, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్‌ నగరంలో మరో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది.
 
అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అక్టోబర్ 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లారు. తర్వాత భరణికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాప్ చేయబడి ఉంది. తర్వాత రోజు ఆయన భరణి పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా ఆమె రాలేదని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. 
 
దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు, మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments