Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్త ముందే యువతిపై స్నేక్ గ్యాంగ్ గ్యాంగ్ రేప్!

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (11:09 IST)
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన స్నేక్ గ్యాంగ్..  తనకు కాబోయే భర్త ముందే ఓ యువతిపై అత్యాచారం జరిపి కటకటాలపాలయ్యారు. ఈ గ్యాంగ్ రేప్‌ కేసులో ఫిర్యాదు చేసినా.. గ్యాంగ్‌ను అరెస్టు చేసేందుకు వెనుకంజ వేసిన సీఐ భాస్కర్ రెడ్డిపైనా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వేటు వేశారు. ఈ సీఐను వెయిటింగ్‌ లిస్టులో ఉంచారు. 
 
తనకు కాబోయే భర్తతో పాటు పామ్‌హౌస్‌కు వచ్చిన ఓ యువతిపై ఏడుగురు స్నేక్ గ్యాంగ్ సభ్యులు అత్యంత అమానుషమైన రీతిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులు న్యాయస్థానంలో లొంగిపోవడానికి సహకరించినవారెవరు, నిందితుడు ఖాదర్‌ బారక్‌బ తండ్రి ఆలీ బారక్‌బ ఒక్కరేనా లేదా పోలీసుల పాత్ర ఉందా? సమాధానం వెతికే పనిలో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. 
 
సామూహిక అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఫైసల్‌ దయానీ, ఖాదర్‌ బారక్‌బ, సలామ, పర్వేజ్‌, సయ్యద్‌ అన్వర్‌, ఖాజా అహ్మద్‌, మహ్మద్‌ ఇబ్రహీం పరారయ్యారు. వీరిలో ఖాదర్‌ బారక్‌బ, సయ్యద్‌ అన్వర్‌, ఖాజా అహ్మద్‌ 11న రంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. మరో ముగ్గురు నిందితులు సలామ, మహ్మద్‌ పర్వేజ్‌, మహ్మద్‌ ఇబ్రహీంలను పోలీసులు మూడో తేదీన అరెస్టు చేశారు. అప్పటికీ ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయానీ పరారీలోనే ఉన్నాడు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?