Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ ఇవ్వలేదని షాపు యజమానిపై కత్తితో దాడి...

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (19:36 IST)
హైదరాబాదు హుమయున్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. హుమాయున్ నగర్ పిఎస్ పరిధిలోని మల్లేపల్లి రియాన్ హోటల్ వద్ద  కిళ్ళీ కొట్టు నిర్వహిస్తున్నాడు కాజా జియావుద్దీన్. రాత్రి కావడంతో తన కిల్లీ కొట్టును మూసివేసే సమయంలో అదే మల్లేపల్లి ప్రాంతంలో నివాసముండే షేక్ హాసన్ తనకు సిగరెట్ కావాలంటూ షాపు దగ్గిరకి వచ్చాడు. 
 
సమయం మించిపోవడంతో షాపు మూయడం జరిగిందని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. కాజా జియావుద్దీన్ తన షాపు మూసివేసాను ఇప్పుడు ఇవ్వడానికి కుదరదని కరాఖండిగా చెప్పడంతో షేక్ హుస్సేన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కాజా జియావుద్దీన్ పైన దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడిలో కాజా జియావుద్దీన్‌కు గొంతుపైన, ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హుమాయున్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షేక్ అస్సన్ పరారీలో ఉన్నట్లు హుమాయున్ నగర్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిందితునిపై సెక్షన్ 307, 324 కేసుల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments