Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు నరబలి...?

నరబలి అనే మాట వింటేనే వళ్లు గగుర్పొడుస్తుంది. ఈ నరబలి అనే మాటను ఇదివరకటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కనబడేవి. మూఢ విశ్వాసాలను ఆధారంగా చేసుకుని అప్పట్లో అవి జరిగేవంటూ ప్రచారం వుంది. ఐతే నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి నరబలి అనేది జరిగిందంటే ఇంక అంతకన్న

Webdunia
శనివారం, 1 జులై 2017 (15:50 IST)
నరబలి అనే మాట వింటేనే వళ్లు గగుర్పొడుస్తుంది. ఈ నరబలి అనే మాటను ఇదివరకటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కనబడేవి. మూఢ విశ్వాసాలను ఆధారంగా చేసుకుని అప్పట్లో అవి జరిగేవంటూ ప్రచారం వుంది. ఐతే నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి నరబలి అనేది జరిగిందంటే ఇంక అంతకన్నా ఘోరం ఇంకేముంటుంది? ఐతే ఇది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌లో భాగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అనుబంధ రిజర్వాయర్‌గా పేరొందిన కరీంనగర్ జిల్లా మేడారం సమీపంలోని చామన్ పల్లి పంప్ హౌస్ వద్ద ఈ నరబలి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. నరబలికి గురైన వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని అంటున్నారు. 
 
ఈ ప్రాజెక్టులో పనులు చేసేందుకు అతడిక్కడికి వచ్చాడు. ఐతే ఏడాది క్రితం అతడు కనిపించకుండా పోయాడు. దాంతో ఎంతకీ తమవాడు ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అందుకున్న పోలీసులు అతడి ఆచూకి కోసం ఇక్కడికి రాగా నరబలి అంటూ ఓ వార్త వెలికి వచ్చింది. 
 
అక్కడివారు ఇదే అంశంపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు అసలు ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఒకవేళ నరబలి నిజమే అయితే ప్రాజెక్టు వద్ద తవ్వకాలు చేపట్టి శవాన్ని వెలికి తీసే అవకాశం వుందంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments