Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష‌లో ష‌ర్మిలా, దమ్ముంటే చర్చకు వస్తారా?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:40 IST)
తెలంగాణాలో నిరుద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష‌కు వై.ఎస్.ఆర్. టీపీ అధినేత ష‌ర్మిలా ఉప‌క్ర‌మించారు. హైద‌రాబాదులో ఆమె చేస్తున్న నిరాహార‌దీక్ష‌కు సంఘీభావంగా కొంద‌రు మ‌హిళ‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

జ‌హీరాబాద్ పార్ల‌మెంట‌రీ క‌న్వీన‌ర్ బొరుగు సంజీవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌ని దౌర్భాగ్య‌మైన ప్ర‌భుత్వ‌మిద‌ని టిఆర్ ఎస్ ను విమ‌ర్శించారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోగా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి క‌ల్పించ‌లేద‌ని, మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల జాడ‌లేద‌ని విమ‌ర్శించారు.

నిరుద్యోగ భృతి పేరుతో యువ‌త‌ను ద‌గా చేశార‌ని, మ్యానుఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని ఆరోపించారు. నిరుద్యోగి మ‌హేంద‌ర్ మృతికి వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ జోహార్లు అర్పిస్తుంద‌ని చెప్పారు. అధికారం ఉంద‌నే అహంకారంతో వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీల‌ను చింపేస్తున్నార‌ని, చిన్న టెంట్లు వేసుకుని దీక్ష చేస్తుంటే, లా అండ్ ఆర్డ‌ర్ పేరుతో గొడ‌వ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఆనాడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ల‌క్ష ఉద్యోగాలు భ‌ర్తీ చేసి నిరుద్యోగుల‌కు అండ‌గా నిలిచార‌ని పేర్కొన్నారు. దమ్ముంటే వైయఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో, కేసీఆర్ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో చ‌ర్చ‌కు రావాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళా సాధికారత నేపథ్యంలో మిమో చక్రవర్తి, సాషా చెత్రి సినిమా నేనెక్కడున్నా

గ్రామీణ నేపథ్యంలో యదార్థ సంఘటన ఆధారంగా ప్రేమకు జై

విరాజ్ రెడ్డి చీలం, గార్డ్ - రివెంజ్ ఫర్ లవ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం

తొలి చిత్రంతోనే టాలెంటెడ్ ప్రదర్శించిన హీరోయిన్ భైరవి

Malavika Mohanan: ప్రభాస్ స్వయంగా బిర్యానీ వడ్డించారు.. ఆయన సూపర్.. మాళవిక మోహనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments