Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 శాతానికే గతిలేదు.. ఇక 12 శాతం ఏమిస్తడు : ముస్లిం రిజర్వేషన్లపై షబ్బీర్ కామెంట్స్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2016 (14:07 IST)
ముస్లింలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సవాలక్ష ప్రశ్నలు సంధిస్తోందని, ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా 12 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని తెలంగాణ శాసనసమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. 
 
సుప్రీంకోర్టులో ముస్లిం రిజర్వేషన్ల కేసు విచారణ జరిగింది. ఈ కేసు విచారణ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ఎలా చెప్పారో.... ఎలా అమలవుతుందో అర్థం కావడం లేదన్నారు.
 
రిజర్వేషన్‌లో ఏ కులాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా బీసీ కమిషన్‌కే అధికారం ఉందని, విచిత్రమేమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బీసీ కమిషన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. పైగా 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణకు సైతం తెలంగాణ రాష్ట్రం ఒక్కరంటే ఒక్క న్యాయవాదిని కూడా పంపించలేదని ఆయన గుర్తుచేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments