Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ - కేటీఆర్ తీరువల్లే మెట్రోకు చిక్కులు : షబ్బీర్ అలీ

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:29 IST)
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే అంశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్లే చిక్కులు ఉత్పన్నమవుతున్నాయని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరువల్లే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ తప్పుకొంటామని చెబుతోందన్నారు. 
 
ఆయన తీరువల్లే రాష్ట్రానికి రావాల్సిన 'హీరో' మోటార్ సైకిళ్ల ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు తరలిపోయిందని, తెలంగాణలోని మహేంద్ర ట్రాక్టర్ల యూనిట్ విద్యుత్ సమస్య కారణంగా బెంగళూరుకు తరలిపోయిందని అలీ గుర్తు చేశారు. రాబోయే మూడేళ్ల వరకూ కరెంట్ కష్టాలు తప్పవని కేసీఆర్ అంటున్నారని, కేవలం ఆయన నిర్లక్ష్య వైఖరి వల్లే పరిశ్రమలు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా పోతున్నాయని, ఇలాగైతే తెలంగాణ అభివృద్ధి సాధ్యంకాదని ఆయన హెచ్చరించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments