సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు, పోలీసు కస్టడిలోకి నిందితులు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:29 IST)
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఇద్దరు నిందితులైన సాయికృష్ణ, దేవరాజ్‌ను మూడురోజుల పాటు కస్టడిలోనికి తీసుకున్నారు.
 
వారి నుంచి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
 
శ్రావణి ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్లో సాయి, దేవరాజ్, శ్రావణి మధ్య గొడవ జరిగింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురి సెల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. ప్రేమ పేరుతో శ్రావణిని సాయి, దేవరాజ్ మోసం చేశారు. ఈ కేసులో లభించిన ఆడియోలు, వీడియోల ఆధారంగా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments