కస్టమర్లకు నాణ్యతలేని ఆహారం.. సికింద్రాబాద్‌లో ఆల్పా హోటల్ సీజ్

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (08:57 IST)
హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టరమర్లకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సికింద్రాబాద్ నగరంలోని ఆల్పా హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. ఆదివారం ఈ హోటల్‌లో తనిఖీలు చేసిన జీహెచ్ఎంసీ అదికారులు.. ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నెల 15వ తేదీన ఈ హోటల్‌పై పలువురు ఫిర్యాదు చేసారు. అంతకుముందు కొద్ది రోజులుగా హోటల్‌లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు... హోటల్‌లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. 
 
హోటల్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యపూరిత ధోరణి గుర్తించారు. దీంతో, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారిని హెచ్చరించారు. తదుపరి చర్యలు తీసుకునే వరకూ హోటల్‌ను మూసేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, ఆపై హోటల్ యాజమాన్యానికి పెనాల్టీ విధిస్తామని వారు తెలిపారు. అలాగే, హోటల్‌లోని ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments