Webdunia - Bharat's app for daily news and videos

Install App

సడెన్ గా పట్టాలపైకి బస్సు... ఢీకొనగానే పెద్దగా ఏడ్చేశా... రైలు డ్రైవర్

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (13:40 IST)
సడెన్ గా పట్టాలపైకి స్కూలు బస్సు. కంట్రోల్ చేసేందుకు సడెన్ బ్రేక్ వేసేటప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. బస్సును రైలు ఢీకొంటూ ఈడ్చుకొస్తుంటే పెద్దగా ఏడ్చేశాను. రోదిస్తూనే రైలును ఆపేందుకు బ్రేకులు వేస్తూనే ఉన్నానంటూ రైలు డ్రైవరు సత్యనారాయణ ఆవేదనతో చెప్పారు.
 
ఉదయాన్నే ఈ ఘోర విషాదాన్ని చూడాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము నాందేడ్ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి నిబంధనల ప్రకారం రైలు హారన్ మోగిస్తూనే వచ్చామనీ, కానీ మాసాయిపేట వద్ద అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి బస్సు రావడం చూసి గుండె పట్టేసినంత పనైందన్నారు. 
 
కానీ ఏమీ చేయలేకపోయామనీ, కళ్ల ముందు పసిబిడ్డల ప్రాణాలు పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైలును ఆపిన తర్వాత కొంతమంది తమపై దాడి చేసేందుకు వచ్చారనీ, కానీ అక్కడే మరికొందరు వారించారన్నారు. తాము వెంటనే రైల్వే అధికారులకు సమాచారాన్ని చేరవేసినట్లు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments