Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ రూ.2కోట్ల భారీ విరాళం

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (12:15 IST)
అగ్రరాజ్యాలు కూడా వైరస్ కొరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యుద్ధం చేస్తోంది. అయినప్పటికీ.. ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు. కరోనా మహమ్మారిని నిర్ములించడానికి ఆయా దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో అనేక పరిశ్రమలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. 
 
లాక్‌డౌన్‌తో రోజు వారి కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments