ఈ-పాస్ ఉంటేనే తెలంగాణాలోకి అడుగుపెట్టండి : టీఎస్ పోలీస్

Webdunia
ఆదివారం, 23 మే 2021 (09:24 IST)
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేశారు. సరిహద్దు జిల్లా అయిన సూర్యాపేట సరిహద్దుల్లో జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్ తనిఖీ చేశారు. 

ఈ సందదర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే వారికి e-పాస్ అనుమతి తప్పనిసరి అన్నారు. ఉ.6 గంటల నుంచి ఉ.10 గంటల సమయంలో కూడా ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు అనుమతులు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు.

అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేధించామన్నారు. కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్‌డౌన్‌ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారు.

అలాగే ఆంధ్రా నుంచి ఎ
లాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుంచి 6 గంటలోపు రామాపురం క్రాస్ రోడ్డు అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌కు చేరుకుని అక్కడే 6 గంటల వరకు వేచి ఉండి మినహాయింపు సమయంలో తెలంగాణలోకి వస్తున్నారు.

ఈ కారణం చేత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేశామని ఎస్పీ తెలిపారు. తెలంగాణాలోకి రావాలంటే ఏ సమయంలోనైనా ఈ-పాస్ ఉండాలన్నారు. దీనిని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments