తెలంగాణాలో ఉత్సవ విగ్రహాలుగా దళిత ఎమ్మెల్యేలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Webdunia
శనివారం, 24 జులై 2021 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన 29 మంది దళిత శాసనసభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఇటీవల తన పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. గతంలో మోసగించారన్నారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం రాత్రి వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉప ఎన్నిక ఉన్నందునే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు కేటాయించారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు. 
 
బానిస బతుకులు మారాలని, బీరు, బిర్యానీలకు ఓట్లు వేసే కాలం పోవాలనే తాను ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదులుకున్నానని, ఎవరికీ అమ్ముడుపోకుండా.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసిన మరుసటిరోజే తనపై కేసు పెట్టారని, ఎన్ని కేసులు నమోదు చేసినా భయపడేది లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !

వేణు ఉడుగుల ఆవిష్కరించిన సింగిల్ రాజు టైటిల్, గ్లింప్స్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Colors Swathi: పెళ్ళి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. స్వాతి

తర్వాతి కథనం
Show comments