Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు, ప్రైవేటు ఆస్పత్రి చేతివాటం ఏమిటి?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:42 IST)
హైదరాబాదు నగరంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా సోకిన బాధితులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే వారినుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ జలగల్లా రక్తం పీల్చినట్టుగా పీలుస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఓ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రి వేసిన ఫీజును చూసి గుండేపోటుతో మరణించాడు.
 
అంతేకాక కరోనా సోకిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులలో చేరితే సాటి వైద్యులని కూడా చూడకుండా వారిపై కూడా ఫీజులు బాదుతున్నారు. ఏమని ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిని బంధిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకెళితే కరోనా భాదపడుతున్న వ్యక్తి, అతని భార్య 10 రోజుల క్రితం హైదరాబాదు సోమాజిగూడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
 
అక్కడ 10 రోజుల పాటు వైద్యం అందుకున్న ఆ వ్యక్తికి రూ. 17.5 లక్షల బిల్లు వేశారు. కాగా ఆ బిల్లులో 8 లక్షలు వారి కుటుంబ సభ్యులు కట్టారు. ఈ క్రమంలో బాధితుని భార్య కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం బిల్లు కడితేనే భార్య మృతదేహాన్ని ఇస్తాననడంతో ఆ మాటలకు బాధితుడు ఆవేదనతో గుండెపోటు వచ్చి మరణించాడు. ప్రస్తుతం ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబాన్ని బెదిరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల బాదుడు మామూలుగా వుండటంలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments