Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ మొగిలయ్యకు ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.1 కోటి: సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (21:59 IST)
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైద్రాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసారు.
 
 
ఈ సందర్భంగా మొగిలయ్యను సిఎం కెసిఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రకటించారు.
 
 
ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సిఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింపచేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments