Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడే 'రేవంత్ రెడ్డి' సినిమా విడుదల... ఢిల్లీలో 'రాహుల్ గాంధీ' రిలీజ్

రేవంత్ రెడ్డి సినిమా విడుదల ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 31వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రేవంత్ రెడ్డి పార్టీ

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (13:12 IST)
రేవంత్ రెడ్డి సినిమా విడుదల ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 31వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రేవంత్ రెడ్డి పార్టీ చేరికపై ఆ పార్టీ సీనియర్ నేతలు ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కూడా కానున్నారు.
 
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆయన కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలను సరైన దిశలో సంధిస్తూ.. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళకలిగే ఒకే ఒక వ్యక్తిగా భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఏకంగా రాహుల్ గాంధీని కలిసిన తరువాత రేవంత్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను పార్టీ మారుతున్న విషయం ఎవరికీ తెలియకుండా టి.టిడిపి సమావేశాలకు హాజరవుతూ వచ్చారు రేవంత్. కానీ చివర్లో తెదేపాకు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
 
ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి సీతక్క ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు. తెదేపా పదవులు, సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మంగళవారంనాడు ఉదయం ఫ్యాక్స్‌లో లేఖను బాబుకు పంపారు. ఆమెతో పాటు మరికొందరు తెదేపా నాయకులు కూడా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments