Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్‌కు లాగు తడుస్తోంది: రేవంత్ రెడ్డి

Webdunia
బుధవారం, 1 జులై 2015 (18:58 IST)
ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి జైలు నుండి బయటికి రాగానే మీసం మెలేశారు. బెయిల్‌పై బయటికి వచ్చీ రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల బాణాలు సంధించారు. 'బిడ్డా, కేసీఆర్! వస్తున్నా...' అంటూ రేవంత్ రెడ్డి వేకప్ కాల్ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీని అంతం చేస్తానన్న వ్యక్తి పావురాల గుట్టలో కలిసిపోయాడని.. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదన్నారు.  
 
చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్‌కు లాగు తడుస్తోంది" అన్నారు."కేసీఆర్... నువు నిజంగా తెలంగాణ వాడివే అయితే, నీలో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిని రాజీనామా చేయించు" అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కుట్రపూరితంగా తనను జైలుకు పంపాడన్నారు. 
 
పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే కేసీఆర్, ఏబీఎన్, టీవీ 9 గొంతు నొక్కిన సంగతి మర్చిపోయాడా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తన సొంత ఛానెల్ సాయంతో కేసీఆర్ అవాకులు, చెవాకులు పేల్చలేదా అంటూ ప్రశ్నించారు. మందులోకి సోడా పోసినోళ్లంతా మంత్రులయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. తాగుబోతును జాతిపిత అని సన్నాసులు అంటున్నారని, తాగుబోతు ఎక్కడైనా జాతిపిత అయితడా? అని రేవంత్ ప్రశ్నించారు.
 
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణ జాతి పిత అని కూడా అంటున్నారు. ఈ సన్నాసి ఉద్యమం చేస్తే ఆ సన్నాసులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు" అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అలా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఏమంటారని, వారి త్యాగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి నిలదీశారు. అమర వీరుల వల్లే తెలంగాణ సాధ్యమైందని, రాష్ట్ర సాధన తమ వల్లే అయిందని ఎవరూ ఆపాదించుకోవద్దని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి హితవు పలికారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments