కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ- గులాబీ నేత‌ల‌ను ఎందుకు పట్టించుకోరు..?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (16:52 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
అక్రమార్కులపై ఉక్కుపాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవ‌న్నారు రేవంత్‌. గులాబీ నేత‌ల‌ అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఇదంతా మీకు చేత‌కాకనా.. లేక అందులో వాటాలు ఏమైనా ఉన్నాయా? అని నిల‌దీశారు.
 
జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు రేవంత్. అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశార‌ని.. ఇది అంత ఆషామాషీ విషయమా? అంటూ కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు.  
 
దేవరయాంజల్ 437 సర్వే నెంబర్‌లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి పత్రికలు నడుపుతున్నార‌ని కేటీఆర్‌కు గుర్తు చేశారు రేవంత్‌. ఇలా గ్రేటర్‌లో గులాబీ నేత‌ల క‌బ్జాలు కోకొల్ల‌ల‌ని వివ‌రించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments