Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై పాస్ పోర్టు కేసులున్నాయ్.. ఆలుగడ్డలు అమ్ముకునే వ్యక్తిని..?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (19:20 IST)
ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లపై ఫైర్ అయ్యారు. చేతనైతే అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి మాట్లాడాలని తలసానికి రేవంత్ సవాల్ విసిరారు. 
 
టీఆర్ఎస్‌లో చేర్చుకున్న టీడీపీ నేతలందరూ ముందు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసి విమర్శలు చేయండని రేవంత్ రెడ్డి సూచించారు. టీడీపీ పెట్టిన భిక్షతోనే పార్టీలు మారుతున్నవారు.. పదవులు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. పనిలో పనిగా కేసీఆర్‌పై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లంబుగానికి దిమాఖ్ కాళ్లలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. 
 
రాజకీయాల్లోకి రాకముందు మేనమామ ఇంట్లో రబ్బరు చెప్పులు వేసుకుని, చాయ్ కప్పులు ఎత్తేవానికి, మేనమామ గతచరిత్ర తెలియదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పాస్ పోర్టు కుంభకోణం కేసులు ఉన్నాయన్నారు. అప్పట్లో పోలీసులెక్కడ పట్టుకెళ్లిపోతారోనని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇంట్లో దాక్కున్నాడని ఆయన పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments