మోసగాడికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ : రేవంత్ రెడ్డి ఫైర్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (17:07 IST)
మోసగాడికి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ టీపీసీ చీప్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఖండించారు. అస్సాం ముఖ్యమంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఆయన డిమాండ్ చేశారు. పనిలోపనిగా సీఎం కేసీఆర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మోసగాడికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు నమ్మి మోసపోయిందని, మళ్లీ కేసీఆర్‌ను నమ్మి మోసపోం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మదని అన్నారు. 
 
బీజేపీ, తెరాస పార్టీలు కలిసి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయని చెప్పారు. కేంద్రం అవినీతి బయటపెడతా అంటే ఎవరు వద్దని అన్నారు? అని సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోసగాళ్లకు మోసగాడు, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments