Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ నెలలో నా కుమార్తె పెళ్లి.. ఆ తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తా : రేవంత్ రెడ్డి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:45 IST)
టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. తన కుమార్తె వివాహం తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తానంటూ హెచ్చరించారు. అనేకమంది యువకుల బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిజాం పాలన కొనసాగుతోందని ఆరోపించారు. 
 
ఆయన గురువారం మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్లే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్‌తో కలసి ముందుకు సాగుతున్నామన్నారు. మీకు ముఖ్యమంత్రి ఉంటే, మాకు ప్రధానమంత్రి ఉన్నారని టీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు.
 
డిసెంబర్ నెలలో తన కూతురి పెళ్లి చేస్తానని... ఆ తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తానని రేవంత్ హెచ్చరించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఈ రోజు టీడీపీ, బీజేపీలు మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మండవ వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు హాజరయ్యారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments