Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల ఖర్చు : రేవంత్ రెడ్డి ఫైర్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (14:10 IST)
కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల ఖర్చు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు మాత్రం రుణమాఫీ చేయడానికి పైసా కూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గజ్వేల్‌ టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించిన రేవంత్ రెడ్డి తెరాస సర్కారుపై మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ స్పందన సరిగా లేకపోవడం వల్లే ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం లక్ష రూపాయల అప్పు ఉన్న రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
 
రైతుల్ని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రెడ్డి. సీఎం పదవి చేపట్టడానికి గంట కూడా ఆగని కేసీఆర్‌... అధికారంలోకి వచ్చి 16 నెలలైనా రైతులకిచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఫాం హౌస్‌ ప్రభుత్వం నడుస్తుందోనని... మంత్రివర్గం తగిన స్థాయిలో పనిచేయడం లేదని దుయ్యబట్టారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments