Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నారెడ్డి తర్వాత ప్రజాదారణ కలిగిన నేతను నేనే : రేవంత్ రెడ్డి!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (19:57 IST)
మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి తర్వాత అంతటి ప్రజాధారణ కలిగిన నేతను నేనేనని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి పక్కదారి పడుతుంటే చూస్తూ ఊరుకోకుండా చక్కబెట్టాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 
 
తనకు ఫలితంతో పని లేదని, ప్రజల పక్షాన పరీక్ష మాత్రమే రాస్తున్నానని చెప్పారు. చిట్టచివరిగా భవిష్యత్ నిర్ణయించేంది మాత్రం ప్రజలేనని ఆయన తెలిపారు. తెలంగాణలో జరిగిన ఓ సర్వేలో చెన్నారెడ్డి తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేత తానేనని తేలిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
మరో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ శాసనసభను మంత్రి హరీష్ రావు పరోక్షంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో ఇలా అసెంబ్లీని నడపడం చూడలేదని అన్నారు. శాసనసభలో తమకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కార్యాలయం కూడా కేటాయించకుండా అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments