మారువేషంలో రేవంత్ రెడ్డి: గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి జంప్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (18:49 IST)
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. క్యాంపస్‌కు చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. 
 
బాసరకు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే అనుమతి ఇచ్చారు. రాజకీయ నాయకులెవరు బాసరలోకి ఎంట్రీ ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
 
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు. పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్‌ ఐటీకి రేవంత్‌ రెడ్డి చేరుకున్నారు. కాలి నడకన వచ్చి గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించారు రేవంత్ రెడ్డి. 
 
అక్కడే ఉన్న పోలీసులు  రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో వాహనంతో రేవంత్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. 
 
వందలాది మంది పోలీసుల పహారా ఉన్న రేవంత్ రెడ్డి బాసర క్యాంపస్ వరకు ఎలా వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో క్యాంపస్ పరిసరాల్లో భద్రత మరింత పెంచారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments