Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనపర్తి జిల్లాలో ఎంత పేద్ద కొండ చిలువో!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (10:09 IST)
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నేషనల్ హైవే పక్కన ఉన్న హైలెట్ దాబా వెనకాల పొలంలో ట్రాక్టర్ తో దున్నుతుండగా నాగేళ్లకు కొండచిలువ తగిలింది. ఈ పెద్ద కొండచిలువ చూసి భయానికి గురైన ట్రాక్టర్ డ్రైవర్ సాయిలు వెంటనే సమీపంలో ఉన్న గ్రామ ప్రజలకు తెలియజేశారు.

వెంటనే గ్రామ ప్రజలు ఎమ్మార్వో కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కొత్తకోట ఎమ్మార్వో వనపర్తి సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ కి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి కృష్ణ సాగర్ వెళ్లి దాదాపు 13 ఫీట్ల పొడవు 25 కేజీల బరువు ఉన్న పెద్ద కొండచిలువను అతి కష్టం మీద బంధించడం జరిగింది.

ఈ సందర్భంగా కృష్ణ సాగర్ మాట్లాడుతూ ఇంత పెద్ద కొండచిలువను చూడటం.. ఇదే మొదటిసారి అని చెప్పారు. కొండచిలువ వయస్సు సుమారు 15 సంవత్సరాలు ఉంటుందని,  కొండచిలువను సురక్షితమైన నల్లమల అడవి ప్రాంతంలో వదిలి వేయడం జరుగుతుందన్నారు.

అనంతరం కొత్తకోట ఎమ్మార్వో తో పాటు కనిమెట్ట గ్రామ ప్రజలు  సాగర్ స్నేక్ సొసైటీ సభ్యులు శివ సాగర్ గణేష్ అభినందించారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments