Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఆర్టీసీ పుష్పక్ ఎయిర్‌లైనర్ అగ్నికి ఆహుతి!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (12:19 IST)
హైదరాబాద్‌లో మంగళవారం ఆర్టీసీ పుష్పక్ ఎయిర్‌లైనర్ బస్సు ఒకటి అగ్నికి ఆహుతైంది. స్థానిక రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ కూడలిలో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. 
 
రాణిగంజ్ డిపోకు చెందిన ఈ బస్సు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎవరికీ ఏ విధమైన ప్రమాదం జరగలేదు. బస్సు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రమాదం జరిగినప్పుడు నలుగురైదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. మంటలకు బస్సు పూర్తిగా ఆహుతి అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సు అగ్ని ప్రమాదానికి గురై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments