Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి ముందు శవం.. ఆస్తికోసం గొడవలు, బాహుబలి ఊరకే ఘన విజయం పొందలేదు మరి..

రాజ్యాధికారపు పాశవికత, దాని చుట్టూ అల్లుకున్న మమతానుబంధాల మేళవింపు కాబట్టే బాహుబలికి తెలుగు రాష్ట్రాలే కాదు. దేశమే కాదు. ప్రపంచమే దాసోహమైపోయింది. కానీ ఆ కథ ఎప్పుడో జరిగిన కథ కాదని మన కళ్లముదే నేటి ఐటీ యుగంలో కూడా ఆస్తితో ముడిపడిన కక్ష్యలు కార్పణ్యాలు

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (03:28 IST)
రాజ్యం కోసం ఇద్దరు దాయాదుల మధ్య  పోరు దశాబ్దాల పాటు ఎంత క్రూరంగా కొనసాగిందో చెప్పిన అద్భుత చిత్రం బాహుబలి. అన్న భార్యను సంకెళ్లు వేసి పాతికేళ్లు ఆరుబయట బంధించిన ఆ క్రౌర్యం పునాదిగా తీసిన బాహుబలి మరోసారి మహాభారత చిత్రకథను అద్భుతంగా మనముందు ఆవిష్కరించింది. రాజ్యాధికారపు పాశవికత, దాని చుట్టూ అల్లుకున్న మమతానుబంధాల మేళవింపు కాబట్టే బాహుబలికి తెలుగు రాష్ట్రాలే కాదు. దేశమే కాదు. ప్రపంచమే దాసోహమైపోయింది. కానీ ఆ కథ ఎప్పుడో జరిగిన కథ కాదని మన కళ్లముదే నేటి ఐటీ యుగంలో కూడా ఆస్తితో ముడిపడిన కక్ష్యలు కార్పణ్యాలు వదలటం లేదని ఈ ఉదంతం చెబుతోంది. ఇది తెలంగాణ కథే కాదు. దేశం కథ. ఆస్తి ముందర కనీసం మానవ సంస్కారం కూడా బలాదూరేనని నిరూపిస్తున్న కథ.
 
మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన కొరిపెల్లి నరేశ్‌రెడ్డి– సునీత దంపతులు. నరేశ్‌రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేక పోవడంతో సునీత కొంతకాలంగా తన కుమారుడు అచ్యుత్‌‌తో కలిసి పుట్టిల్లయిన నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెంలో ఉంటోంది. అనుకోకుండా ఆమె అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందింది. మృతదేహాన్ని అత్తగారింటికి తరలించిన పుట్టింటివారు నరేశ్‌రెడ్డికి సంబంధించిన ఆస్తిని అతడి కుమారుడు అచ్యుత్‌ పేరిట మార్పిడి చేయాలని, అంత్యక్రియలు కూడా నిర్వహించాలని కోరారు. 
 
ఆస్తిపై ఎలాంటి నిర్ణయం చెప్పని మృతురాలి దాయాదులు.. ఆమె అంత్య క్రియలు నిర్వహించడానికి కూడా ముందుకు రాలేదు. అంతేగాక నరేశ్‌రెడ్డి సోదరుడు ఆస్తిని ఇవ్వనంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఇంతవరకు జాడలేకుండా పోయినట్లు స్థానికులు వెల్లడించారు. దీంతో మృతదేహం మూడు రోజులుగా ఇంటి ఆవరణలోనే ఉంటోంది. ఇంటివారెవరూ అందుబాటులో లేకపోవడంతో స్థానికులే అచ్యుత్‌కు భోజనం అందిస్తున్నారు.
 
ఇది నిజంగానే మరో మహాభారత కథ. ఆస్తి గొడవలతో బంధువులు ఆ మహిళ మృతదేహానికి దహన సంస్కా రం మరవడం ఒక ఘోరం కాగా, అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడం మరో ఘోరం. ఫలితం మూడు రోజులుగా మృతదేహం ఇంటి ఎదుటే ఉంది.  ఆ గ్రామం ఏమీ పట్టించుకోలేదు. ఈ వార్త బయటి ప్రపంచానికి పాకలేదేమో.. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఇది బాహుబలి కాకపోవచ్చు కాదని తెలంగాణలో మానవ బంధాల బలి. తెలంగాణ అని ఎందుకు పెరెట్టడం అన్ని ప్రాంతాల్లో ఇదే కలి మరి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments