కేటీఆర్​ను ఆశ్రయించిన రష్మీ గౌతమ్: వీధికుక్కలను ఆపరేషన్‌ చేసి..?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (11:21 IST)
యాంకర్ రష్మీ గౌతమ్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ విషయంపై విజ్ఞప్తి చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్‌ను కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది.
 
గతం కొంతకాలంగా హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలి పెడుతున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే వదిలి పెడుతున్నారు. 
 
అయితే.. అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా సేవ్‌యానిమల్స్‌ఇండియా అనే ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ రీచ్ కావడం కోసం వైద్య సిబ్బంది ఇలా శునకాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై మంత్రి కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments