Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు ఆత్మహత్యపై అనుమానాలు - పౌర హక్కుల సంఘం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:41 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి బస్తీలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
కాగా, ఈ చిన్నారి హత్య కేసులో తప్పించుకుని తిరుగుతూ వచ్చిన నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కానీ, ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. ఇంతలోనే వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మృతుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అతను రాజుగా గుర్తించారు. 
 
మరోవైపు రాజుది ఆత్మహత్య కాదు హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిందితుడు రాజు భాగ్య మౌనిక ఆరోపించింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఇపుడు పౌర హక్కుల సంఘం కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments