Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడుగుపెడితే కొడతాం : టీ మంత్రులకు ఓయూ స్టూడెంట్స్ వార్నింగ్!

Webdunia
ఆదివారం, 20 జులై 2014 (17:40 IST)
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అడుగుపెడితే మంత్రులని కూడా చూడకుండా తరిమి కొడతామని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఆ యూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అంశంపై ఆందోళనకు దిగిన ఉస్మానియా విద్యార్థులు ఆదివారం కూడా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం కూడా కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణను నిరసిస్తూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరిని సముదాయించేందుకు వెళ్లిన మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డిని అడ్డుకున్నారు. మంత్రులను అడ్డుకుని వాగ్వాదానికి దిగడంతో అక్కడ కాసేపు ఉధ్రిక్తత ఏర్పడింది. 
 
ఆదివారం నాటి ఆందోళనలో భాగంగా తార్నాక వైపు దూసుకెళుతున్న విద్యార్థులను పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే, ఖాళీ పోస్టులన్నీ భర్తీ కావడంతో తమకు అసలు ఉద్యోగాలే దక్కని స్థితి నెలకొనే ప్రమాదముందని ఓయూ విద్యార్థులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కేసీఆర్ సంసిద్ధతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments