Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ శివారులో ఆన్‌లైన్‌ వ్యభిచారం

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (23:17 IST)
కరోనావైరస్ కాలంలోనూ ఆన్‌లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తుంది ఓ ముఠా. భౌతిక దూరం పాటించండి కరోనాను కట్టడి చేయండి అంటూ ప్రభుత్వాలు మొర పెట్టుకుంటున్నా ఖాతరు చేయకుండా యుధేచ్చగా వ్యభిచార వ్యాపారం నడుపుతున్నాడు ఓ నిర్వాహకుడు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన వంశీరెడ్డి, చిన్నా, విజయవాడకు చెందిన ఓ మహిళ కలిసి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా చేసే బ్రోకర్ల సహయంతో ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నారు.
 
పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన నలుగురు అమ్మాయిలను
 దళారులు ద్వారా హైదరాబాద్‌కు రప్పించి బల్కంపేట్‌‌లో అద్దెకు ఇళ్లు తీసుకుని అందులో ఉంచుతున్నారు ఈ నిర్వాహకులు. సోషల్ మీడియాలో యువతులు ఫోటోలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. అమ్మాయి మీకు నచ్చితే ఈ నెంబరు కాల్ చేయండి అంటూ ఒక ఫోన్ నెంబరు ఇస్తున్నారు.
 
టులు నుంచి ఫోన్ రాగానే మీకు మరలా ఫోన్ చేస్తాం అని చెప్పి, ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు పూర్తిగా తెలుసుకుని వీరికి నమ్మకం కుదిరిన తరువాత గూగుల్ పే, పేటీఎం ద్వారా అకౌంట్లో సగం డబ్బులు వేయించుకుంటున్నారు. ఆ తరువాత కోరుకున్న అమ్మాయిలను విటులు కోరిన చోటుకు తీసుకెళ్తారు. ఇది రెగ్యులర్‌గా జరిగే వ్యవహారం. అయితే ఈ దందాపై పోలీసులకు సమాచారం అందడంతో డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు.
 
ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న వ్యక్తులను మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లికి రప్పించి నలుగురు యువతులను నిర్వహకుడు వంశీరెడ్డిని అరెస్ట్ చేశారు. యువతులను పునరావస కేంద్రాలకు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments