Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లలు దాటిన ప్రేమ: ఒక్కటి కానున్నసికింద్రాబాద్ అబ్బాయి- జర్మనీ అమ్మాయి

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (05:09 IST)
ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపితమైంది. ఖండాంతరాలు, దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. దీన్ని మరోసారి నిరూపించారు తెలంగాణ యువకుడు, జర్ననీ అమ్మాయి. 

తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్, జర్ననీ అమ్మాయి జూలియా మూడు ముళ్ల బంధంతో త్వరలో ఏడడుగులు వేయనున్నారు. స్వర్ణాకర్, జూలియా హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. 
 
సికింద్రాబాద్ కు చెందిన స్వర్ణాకర్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం జర్ననీ దేశానికి వెళ్ళాడు. స్వర్ణాకర్ ఉద్యోగం చేస్తూనే, తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షుడైన స్వర్ణాకర్, జర్మనీలో ఉన్న తెలంగాణ వాసులతో బతుకమ్మ, బోనాలతో పాటు, తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. 
 
స్వర్ణాకర్, జర్ననీలో తనతో పనిచేస్తున్న, అదే దేశానికి  చెందిన అమ్మాయి జూలియాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వారి ప్రేమను ఇరువైపులా తల్లిదండ్రులు అంగీకరించి, స్వర్ణాకర్-జూలియాల పెళ్లికి నిశ్చయించారు. ఈ నెల 22 న బేగంపేటలో భారతీయ  సాంప్రదాయం ప్రకారం జూలియా – స్వర్ణాకర్ ల వివాహం జరగనుంది. ఈ సందర్భంగా జూలియా – స్వర్ణాకర్ లను మాజీ ఎంపీ కవిత అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments