Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికలు: తెలంగాణ తదుపరి సీఎం రేవంత్ రెడ్డి?

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (15:14 IST)
తెలంగాణలో సీనియర్ టీడీపీ లీడర్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్. కేసీఆర్ సర్కారుకు కంటిలో నలుసుగా మారిన రేవంత్ రెడ్డి.. టి. సర్కారుపై విమర్శలపై విమర్శల చేస్తూ ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు ధీటుగా స్ట్రాంగెస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్న రేవంత్ రెడ్డిని టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్సుందని వార్తలొస్తున్నాయి. 2019 ఎన్నికల్లోపు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి.. తద్వారా రేవంత్ రెడ్డి సీఎం పదవిలో కూర్చోబెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. 
 
అంతేగాకుండా 2019 ఎన్నికల టార్గెట్‌తో పనిచేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పటిష్టపరచాలని.. అలా చేస్తే బీసీ లీడర్ అయిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తానని చంద్రబాబు ఇప్పటికే ప్రామిస్ కూడా చేసేశారని.. టీడీపీ వర్గాల సమాచారం. 
 
ఇటీవల నిర్వహించిన సర్వేతో తెలంగాణ సీఎం చెన్నా రెడ్డికి తర్వాత అంత పవర్‌ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డేనని తేలింది. ఈ సర్వే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ధ్రువీకరించారు. 
 
ఇంకేముంది..? ఇరు ప్రాంతాల్లో టీడీపీని బలోపేతం చేసి పది సంవత్సరాల పాటు ఇరు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీని తిరుగులేకుండా చేయాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నానికి రేవంత్ రెడ్డి కూడా తోడైతే.. తెలంగాణలోనూ కేసీఆర్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments