Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముజ్రా పార్టీ ఎఫెక్ట్ : 9 మంది జీహెచ్‌ఎంసీ అధికారుల సస్పెన్షన్‌

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:36 IST)
ముజ్రా (రేవ్) పార్టీలో అనైతిక చర్యలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన 9 మంది జీహెచ్‌ఎంసీ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేస్తూనే... ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు సంజయ్‌కుమార్‌, పద్మభూషణ్‌రాజు, రవీంద్రుడు, బిల్‌ కలెక్టర్లు కృష్ణ, నరహరి, జ్ఞానేశ్వర్‌, రణవీర్‌, భూపాల్‌, బాబూరావులు ఉన్నారు. 
 
కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌ నగర శివారు ఖానామెట్‌లో ఓ ప్రైవేట్ భవనంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు దాడిచేసి 10 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో పాటు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఈ భవనంపై దాడి చేసి జీహెచ్ఎంసీ అధికారులను అరెస్టు చేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments