Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలొస్తే తెలంగాణ వెంకయ్యకు గుర్తే రాదు.. ఓన్లీ ఏపీనే గుర్తుంటుంది: కవిత

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. ఏపీకి ఎంత వరద సాయం చేస్తారో తెలంగాణకూ అంతే సాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. విమోచనం అన్నప్పుడే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుందని, వరదలు వచ్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:15 IST)
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. ఏపీకి ఎంత వరద సాయం చేస్తారో తెలంగాణకూ అంతే సాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. విమోచనం అన్నప్పుడే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుందని, వరదలు వచ్చినప్పుడు వెంకయ్యకు ఏపీనే గుర్తుకు వస్తుందన్నారు. తెలంగాణలో వరదలొచ్చినా వెంకయ్య వరద బాధితులపై నోరెత్తకపోవడం దారుణమన్నారు. 
 
తెలంగాణ జాగృతి తరుపున బతుకమ్మ పాటలకు సంభందించిన యాప్‌ను విడుదల చేసిన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వరదల సమయంలో ఏపీలో విహంగ వీక్షణం చేసిన వెంకయ్య తెలంగాణను మాత్రం మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ నెల 30 నుంచి బతుకమ్మ సంబురాలను ప్రారంభిస్తామన్నారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. 
 
వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుందామన్నారు. ఇకపోతే.. మిడ్ మానేరుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments