Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేశ్‌ తవ్విన గుంతలో మోహన్‌బాబు ఫ్యామిలీ : జీవిత

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (23:08 IST)
‘‘నేను ఎంతో గౌరవంగా చూసే రాజీవ్‌ కనకాల, శివ బాలాజీ నిజాలు మాట్లాడడం లేదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాట తప్పు అని నిరూపిస్తా. వాళ్లది తప్పని నిరూపితమైతే మాకు ఓటేసి గెలిపించండి! నేను తప్పు మాట్లాడాను అనుకుంటే నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి. ఓట్లు కోసం సైనికుల్లా పోరాడండి. అన్యాయంగా కాదు.

ఎవరు మంచి చేస్తారో వాళ్లనే ఎన్నుకోండి. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. విశాల్‌ నడిగర్‌ సంఘం అధ్యక్షుడు అయ్యారు. ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ అధ్యక్షుడు కాకూడదా? కళకి భాషాభేదాలు ఏంటి? ఎందుకు ఇవన్నీ లేవనెత్తుతున్నారు. మోహన్‌బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోంది.

నరేశ్‌ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోతుంది. ‘మా’ విషయంలో నరేశ్‌ చేసినవన్నీ స్వార్థపూరిత పనులే!  ప్రకాశ్‌రాజ్‌ నిజాయతీగా పనిచేస్లారు. నేను మంచి పనులు చేయాలని వచ్చా. జీవిత రాజశేఖర్‌లను పిచ్చోళ్లని చేయొద్దు’ అని అన్నారు జీవిత .

‘‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. ఎన్నికల వేళ ధర్మంగా న్యాయంగా పోరాడండి. ఇది మన కుటుంబం. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు, తాయిలాల అవసరం లేదు. లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ‘మా’ సభ్యుల్లో సుమారు 920 మంది ఉంటారు. 60 ఏళ్ల పైబడిన వారు ఓటు వేయాలంటే భయపడుతున్నారు.

‘అమ్మా మీకు ఓటు వేయగలమా మీకు? వచ్చి  ఓట్లు గుద్దించుకువెళ్తారేమో’ అని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’’ జీవిత అన్నారు. ‘మా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments