Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై కాంగ్రెస్ ఆరేళ్ళ బహిష్కరణ వేటు!

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (11:07 IST)
పార్టీ విప్‌ను ధిక్కరించిన నవాబ్‌పేట జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు  తెలంగాణ పీసీసీ ప్రకటించింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో యాదవరెడ్డి చేతులు కలిపారు. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరిస్తున్న ఆయన శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు పలికారు. కాంగ్రెస్ జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా రేసులో నిలిచిన యాదవరెడ్డి ఊహించనిరీతిలో గులాబీ గూటికి చేరారు. 
 
ఈ నేపథ్యంలోనే కౌన్సిల్ ఎన్నికలతో గులాబీ శిబిరానికి చేరువైన యాదవరెడ్డి.. జెడ్పీ ఎన్నికల్లోను ఆ పార్టీ అభ్యర్థికే ఓటేశారు. దీంతో పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని డీసీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై బదులివ్వాలని కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేంద్రమాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన యాదవరెడ్డి ఏఐసీసీ సభ్యుడు కూడా. ఈ క్రమంలోనే ఆయనపై బహిష్కరణాస్త్రం ప్రయోగించడం ఆలస్యమైందని పార్టీవర్గాలు స్పష్టం చేశాయి.  

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments