Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజగోపాల్ అన్నా తొందరపడకు.. మాటజారకు...: ఎమ్మెల్సీ కవిత కౌంటర్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:58 IST)
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఒక విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సమర్చించిన చార్జిషీటులో కవిత పేరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ చార్జిషీటులో "లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఉంది'' అని రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌కు ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. "రాజగోపాల్ అన్నా... తొందరపడకు.. మాట జారకు.. 28 సార్లు నా చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు.." అని కవిత రీట్వీట్ చేశారు. 
 
మరోవైరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు. మున్ముందు కవిత ఇవ్వాల్సిన వివరణలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై కూడా కవిత స్పందించారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమైనవి. అబద్ధం. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments