Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు: తెలంగాణ మంత్రి

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (20:53 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యుత్ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడంలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. మెడ మీద కత్తి పెట్టినా బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పినట్లు హరీష్‌రావు గుర్తుచేశారు. విద్యుత్ సంస్కరణలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. 
 
పనిలో పనిగా బీజేపీపై మరోసారి మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 40వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నాయకులు ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. పేదలను పక్కనపెట్టి కార్పొరేట్ల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని హరీష్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. 
 
బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అంటుంటే.. కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని సూటిగా ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ పార్టీ అతీగతీ లేని పార్టీ అని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments