Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనమంతా బీజేపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయి.. ఆ ప్రచారం తప్ప..? హరీష్ రావు

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (16:26 IST)
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని.. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. నల్లధనం బీజేపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం తప్ప యువత కోసం చేసింది లేదు.. యువత బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. 
 
కాగా గ్రేట్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతున్న నేపథ్యంలో.. బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు హరీష్ రావు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పాడు. బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం అని అబద్ధాలు చెబుతున్నాడని హరీష్ రావు తెలిపారు. వరదలు వస్తే బెంగుళూరుకు 600, గుజరాత్ 500 కోట్లు ఇచ్చారు.. కానీ తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదన్నారు.
 
బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసి.. నగర యువత ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేశారన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఉద్యోగులను తీసివేస్తున్నారు. పఠాన్ చెరువు నియోజకవర్గం మెడికల్ డివైస్ పార్కు, ఐటీ పార్కులు ఏర్పాటుతో యువతకు ఉపాధి రాబోతుందన్నారు. టీఆర్ఎస్ జీహెచ్ఎంసి మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని హరీష్ రావు అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments